జల్లు జల్లుగ కురియు జల ధార నేను
ఎల్లలను వెలిగించు తొలి పొద్దు నేను
ఉప్పెనై ఉప్పొంగు లవణాబ్ధి నేను
నిప్పులను గుప్పించు బడబాగ్ని నేను
....................................
విశ్వమంతా నిండి వెలుగుల్ని మింగే
విలయ రాత్రిని నేను కరుగనే లేను...
విస్ఫులింగ జ్వాలలెగెసెగసి ముసిరే
విషమ కాలాంతపు ఆగ్నికీలను నేనారనేలేను.....
.................................